తెలంగాణలో లులూ గ్రూప్ 3500 కోట్ల పెట్టుబడి

Update: 2023-06-26 07:13 GMT

తెలంగాణలో మరో ప్రతిష్టాత్మక సంస్థ పెట్టుబడులు పెట్టనుంది. రాష్ట్రంలో రూ.3,500 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు లులూ గ్రూప్‌ ఛైర్మన్‌ యూసఫ్‌ అలీ ప్రకటించారు. మంత్రి కేటీఆర్‌ సమక్షంలో పెట్టుబడుల కార్యాచరణను ప్రకటించారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ అండ్ ఎక్స్‌పోర్ట్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు యూసుఫ్ అలీ తెలిపారు. ఇప్పటికే రూ.300 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో షాపింగ్‌ మాల్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మాల్ కు సంబంధించి 80శాతం పనులు పూర్తయ్యాయని.. ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో షాపింగ్‌ మాల్‌ ప్రారంభిస్తామని చెప్పారు




 


ఈ సందర్భంగా లులూ పెట్టుబడులపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. లులూ పెట్టుబడులతో తెలంగాణ టూరిజం మరింత పెరుగుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకెళ్తోందన్నారు. తెలంగాణ ఆచరిస్తున్నది.. దేశం అనుసరిస్తున్నదని కేటీఆర్ అన్నారు. 10వేల ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 300కోట్లతో మెగా డెయిరీ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.





 



Tags:    

Similar News