ప్రశాంతంగా ముగిసిన మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ పోలింగ్

By :  Krishna
Update: 2023-11-17 13:13 GMT

మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మధ్యప్రదేశ్ లో 230 స్థానాలకు ఒకే విడతలో ఇవాళ పోలింగ్ జరిగింది. ఛత్తీస్ గఢ్లో ఈ నెల 7న తొలి విడత పోలింగ్ జరగ్గా.. ఇవాళ 70 స్థానాలకు తుది విడత పోలింగ్ నిర్వహించారు. రెండు రాష్ట్రాల్లో ఉదయం మందకోడిగా సాగిన పోలింగ్.. సాయంత్రానికి వేగం పుంజుకుంది. దీంతో ఓటింగ్ శాతం భారీగా పెరిగే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్లో 80, ఛత్తీస్ గఢ్లో 70శాతానికిపైగా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉంది.

మధ్యప్రదేశ్‌లో 2,533 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 5 కోట్ల 60 లక్షల మంది ఓటర్లు నిర్ణయించనున్నారు. ఇక ఛత్తీస్ గఢ్లో రెండో విడత ఎన్నికల బరిలో 958 మంది అభ్యర్థులున్నారు. సీఎం భూపేశ్ బఘేల్, డిప్యూటీ సీఎం టీఎస్ సింగ్ దేవ్తో పాటు 8మంది మంత్రులు, నలుగురు ఎంపీలు ఈ ఎన్నికల్లోనే పోటీలో ఉన్నారు. మిగితా మూడు రాష్ట్రాలతో కలిపి డిసెంబర్ 3న మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఫలితాలు వెల్లడికానున్నాయి.


Tags:    

Similar News