విద్యేషపూరిత కామెంట్స్.. రాజాసింగ్పై కేసు నమోదు

Byline :  Krishna
Update: 2024-01-08 02:36 GMT

బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, నితేష్ రాణేపై కేసు నమోదు అయ్యింది. విద్వేషపూరిత ప్రసంగం చేసినందుకు గానూ మహారాష్ట్రలోని సోలాపూర్లో ఈ కేసు నమోదైంది. రెండు రోజుల క్రితం సోలాపూర్లో 'హిందూ జన్ ఆక్రోష్' ర్యాలీ నిర్వహించారు. బీజేపీ సహా సకల్ హిందూ సమాజ్ నేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ క్రమంలో రాణే తన ప్రసంగంలో మసీదుల కూల్చివేతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా ఎమ్మెల్యే రాజాసింగ్ లవ్ జీహాద్పై పలు వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇద్దరు ఎమ్మెల్యేలపై కేసు నమోదు చేసినట్లు జైల్ రోడ్డు పోలీసులు తెలిపారు. సెక్షన్ 153ఏ, 295ఏ కింద ఇద్దరు ఎమ్మెల్యేలు సహా 10 మందిపై కేసు నమోదు చేశామన్నారు.

విద్వేషపూరిత వ్యాఖ్యలపై ఇప్పటికే రాజాసింగ్ జైలుకు వెళ్లొచ్చారు. స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారుఖీకి సంబంధించి హైదరాబాద్లో ఈవెంట్ నేపథ్యంలో మహ్మద్ ప్రవక్తపై రాజాసింగ్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఎంఐఎం ఫిర్యాదుతో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. అటు బీజేపీ సైతం ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అసెంబ్లీ ఎన్నికల వేళ ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేసి గోషామహల్ టికెట్ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో గోషామహల్ నుంచి రాజాసింగ్ వరుసగా మూడోసారి గెలిపొందారు.

Tags:    

Similar News