Mahender Reddy : టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా బాధ్యతలు స్పీకరించిన మహేందర్‌రెడ్డి

Update: 2024-01-26 08:14 GMT

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం రిపబ్లిక్‌ వేడుకల్లో భాగంగా టీఎస్పీఎస్సీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌గా మహేందర్‌రెడ్డిని సభ్యులుగా మరో నలుగురిని ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు సెక్రెటరీ అనితారామచంద్రన్‌ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సభ్యులుగా పాల్వాయి రజనీకుమారి, అనితారాజేంద్రతో మహేందర్‌రెడ్డి ప్రమాణం చేయించారు. ఈ నియామకాలకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ వెంటనే ఆమోదం తెలపడంతో చైర్మన్‌, సభ్యుల బాధ్యతల స్వీకరణకు లైన్‌ క్లియరైంది.

టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి నిరుద్యోగులకు న్యాయం చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా టీఎస్పీఎస్సీకి కొత్త చైర్మన్‌, సభ్యులను ప్రభుత్వం త్వరితగతిన నియమించింది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో టీఎస్పీఎస్సీ పరీక్షల పదేపదే వాయిదాలతో పాటు, గ్రూప్-1పేపర్‌ లీకేజీ, పలు పరీక్ష ప్రశ్న పత్రాలు లీకయ్యాయి. వివాదాల్లో ఇరుక్కున్న విషయం తెలిసిందే. కొత్తగా చైర్మన్‌ నియమితులైన మహేందర్‌రెడ్డి ఆ పదవిలో 11 నెలల పాటు కొనసాగనున్నారు. టీఎస్‌పీఎస్‌పీ నిబంధనల ప్రకారం చైర్మన్‌గా.. కమిషన్‌ సభ్యులుగా నియమితులైన వారు 62 ఏండ్లు వచ్చేవరకు మాత్రమే పదవిలో కొనసాగేందుకు అవకాశం ఉంది. అలాగే ఆరేళ్ల పాటు మాత్రమే ఆ పదవిలో కొనసాగాల్సి ఉంటుంది. 1962లో డిసెంబర్‌3న జన్మించిన మహేందర్‌రెడ్డికి ప్రస్తుతం ఆయనకు 61 సంవత్సరాలు. ఇంకో 11 నెలలు ఆయనకు 62 సంవత్సరాలకు చేరుతుంది. ఈ నేపథ్యంలోనే ఆయన 11 నెలల పాటు పదవిలో కొనసాగనున్నారు.


Tags:    

Similar News