బెల్ట్ షాప్‌లో 90ML ఇవ్వట్లేదని పోలీసులకు ఫిర్యాదు

Update: 2023-07-06 03:15 GMT

90ఎంఎల్ మద్యం అమ్మడంలేదంటూ బెల్ట్ షాప్ పై పోలీసులకు పిర్యాదు చేశాడో మందుబాబు. తనకు మద్యం ఇవ్వడానికి నిరాకరించిన షాప్ నిర్వాహకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరాడు. అతడి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. జగిత్యాల రూరల్ మండలం హబ్సీపూర్ కు చెందిన చిరంజీవి మందు తాగడానికి గ్రామంలోని ఓ బెల్ట్ షాప్ కు వెళ్లాడు. ఒక్కడే వుండటంతో 90ఎంఎల్ మద్యం ఇవ్వాలని బెల్ట్ షాప్ నిర్వహకుడు రవిని కోరారు.

అయితే 90ఎంఎల్ అమ్మడం లేదని... క్వాటర్ లేదా హాప్ బాటిల్ కొనుక్కోవాలని సూచించారు. కానీ తనకు 90ఎంఎల్ మాత్రమే కావాలని అడిగాడు. ఇవ్వడానికి నిరాకరించిన బెల్ట్ షాప్ నిర్వహకుడికి, చిరంజీవికి మధ్య వాగ్వాదం జరిగింది. తన మద్యం అమ్మకపోవడంతో ఆగ్రహానికి గురయిన చిరంజీవి నేరుగా జగిత్యాల పోలీస్ స్టేషన్ కు వెళ్ళాడు. బెల్డ్ షాప్ నిర్వహకుడు తనతో దురుసుగా ప్రవర్తించాడని... మద్యం అమ్మకుండా అవమానించాడంటూ పోలీసులకు తెలిపాడు. 90ఎంఎల్ ఇవ్వకపోవడమే కాదు కులం పేరుతో దూషించాడంటూ బెల్ట్ షాప్ నిర్వహకుడిపై చిరంజీవి ఫిర్యాదు చేసాడు. 

Tags:    

Similar News