అధికారులపై ఆగ్రహం.. పామును మున్సిపల్ ఆఫీసుకు తీసుకెళ్లి..
అధికారుల నిర్లక్ష్యంపై ఓ వ్యక్తి వినూత్న నిరసన తెలిపాడు. వరద నీటితో ఇంట్లోకి చేరిన పామును పట్టుకోవడంలో అధికారులు అలసత్వం వహించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సదరు వ్యక్తి ఆ పామును తీసుకెళ్లి అధికారుల టేబుల్ పైనే వేశాడు. దీంతో ఒక్కసారిగా ఖంగుతినడం అక్కడున్నవారి వంతైంది. ఈ ఘటన జీహెచ్ఎంసీ పరిధిలో జరిగింది.
అల్వాల్ భారతీనగర్‌లోని నివసించే అక్షయ్‌కుమార్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. భారీ వర్షానికి అతడి ఇంట్లోకి వరదనీటితో పాము వచ్చింది. వెంటనే అతడు మున్సిపల్ అధికారులు ఫిర్యాదు చేశారు. అయితే వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అక్షయ్.. పామును పట్టుకుని దగ్గరలోని వార్డు కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ అధికారులు అందుబాటులో లేకపోవడంతో.. ఇంజినీరింగ్ అధికారి టేబుల్‌పై పామును ఉంచి నిరసన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై అక్షయ్ సమస్యపై స్పందించిన అధికారులు.. అతడి ఇంటి చుట్టుపక్కల ఉన్న చెత్త, పొదల వల్లే పాములు వస్తున్నాయని చెప్పి.. వాటిని తొలగించారు.