IPS Transfer : తెలంగాణలో పలువురు ఐపీఎస్ల బదిలీలు

Byline :  Krishna
Update: 2024-02-12 15:37 GMT

తెలంగాణలో అధికారుల బదిలీలు కొనసాగుతోన్నాయి. ఇప్పటికే డిప్యూటీ కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, డీపీవోలు, ఎంపీడీవోలను బదిలీ చేసిన ప్రభుత్వం తాజాగా పలువురు ఐపీఎస్లను బదిలీ చేసింది. రాచకొండ సీపీ సుధీర్ బాబు బదిలీ అయ్యారు. హైదరాబాద్ మల్టీజోన్ ఐజీగా సుధీర్ బాబును ప్రభుత్వం నియమించింది. రాచకొండ సీపీగా తరుణ్ జోషీ నియామకమయ్యారు. ఐపీఎస్ నవీన్ కుమార్ను డీజీపీ ఆఫీస్కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో వీరి బదిలీలు జరిగినట్లు తెలుస్తోంది

రాచకొండ సీపీగా - తరుణ్ జోషీ

సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీగా - జోయల్ డెవిస్

టీఎస్ఆర్టీసీ విజిలెన్స్ ఎస్పీగా - అపూర్వ రావు

పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్గా - మురళీధర్

రామగుండం సీపీగా - శ్రీనివాసులు

సీఐడీ డీఐజీగా - నారాయణ నాయక్

జోగులాంబ గద్వాల్ డీఐజీగా - ఎల్ఎస్ చౌహాన్

ఈస్ట్ జోన్ డీసీపీగా - ఆర్. గిరిధర్

హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా - సాధన రష్మీ

హైదరాబాద్ మల్టీజోన్ ఐజీగా - సుధీర్ బాబు

సౌత్ వెస్ట్ డీసీపీగా - ఉదయ్ కుమార్ రెడ్డి

ట్రాన్స్ కో డీసీపీ - గిరిధర్

Tags:    

Similar News