రానున్నై మంచి రోజులు.. చికెన్ ధర భారీగా తగ్గొచ్చు. కానీ, టమాటే..?
కూర ఏదైనా టమాటా ఉండాల్సిందే.. పండగ, వీకెండ్ వచ్చిందంటే చికెన్ చేయాల్సిందే. కానీ, గత కొంతకాలంగా అందరి తీరు మారింది. వీటి పేరెత్తితే భయపడేలా అయిపోయింది. దానికి కారణం.. టమాటా, చికెన్ ధరలు కొండెక్కడమే. చిన్న కుటుంబం అయినా.. టమాటా, చెకెన్ కొనాలంటే.. పదిసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. కిలో టామాటా రూ. 150 నుంచి రూ. 200 ఉంటే.. కిలో చికెన్ ధర రూ. 250 వరకు ఉన్నాయి. ఈ క్రమంలో టమాటా ధర దూసుకు పోతుంటే.. చికెట్ ధరలు మాత్రం కాస్త తగ్గ ముఖం పట్టాయి.
కొన్నిరోజుల క్రితం కిలో చికెన్ ధర రూ.350 దాటగా.. ప్రస్తుతం కిలో స్కిన్లెస్ చికెన్ ధర రూ.200-రూ.220 మధ్య ఉన్నాయి. లైవ్ బర్డ్ రూ.110గా అమ్ముతున్నారు. శ్రావణమాసం త్వరలో ప్రారంభం కానుండటంతో చికెన్ ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. రానున్న రోజుల్లో టమాటా ధర మరింత పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. కిలో టమాటా రూ. 300 చేరుతుందని అంటున్నారు. టమాటాతో పాటు పచ్చి మిర్చి, అల్లం ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.