మూడు లారీలు ఢీ.. భద్రాద్రి జిల్లాలో ఘోర ప్రమాదం..
By : Mic Tv Desk
Update: 2023-07-22 02:46 GMT
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జలూరుపాడు వద్ద మూడు లారీలు, ఒక అశోక్ లే ల్యాండ్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో రెండు లారీలు దగ్ధమయ్యాయి. లారీ డీజిల్ ట్యాంకర్ నుంచి ఆయిల్ లీక్ అవడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.