Mahabubnagar Accident : గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. మంటల్లో బస్సు
Byline : Krishna
Update: 2024-01-13 02:21 GMT
జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎర్రవల్లి చౌరస్తా సమీపంలో హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళుతున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. దీంతో బస్సులో మంటలు చెలరేగి.. ఓ మహిళ సజీవదహనమైంది. మరో నలుగురు గాయపడగా వారిని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు. ప్రమాదం జరగిన సమయంలో బస్సులో 40మంది ఉన్నారు. బస్సు బోల్తాపడగానే ప్రయాణికులు బయటికి రాగా.. ఓ మహిళ మాత్రం అందులోనే చిక్కుకుపోయింది. ఈ క్రమంలో మంటలు అంటుకుని మరణించింది. ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బస్సు డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.