ముగిసిన ఈటల, జితేందర్ రెడ్డి భేటీ.. మీడియాతో ముందుకు రాకుండానే..

Update: 2023-07-03 09:07 GMT

తెలంగాణలో బీజేపీలో సంధి రాజకీయం నడుస్తోంది. అసంతృప్తి, ఇతర పార్టీ నేతలతో బుజ్జగింపులు జరిపి.. బీజేపీలోకి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. అవి చాలవన్నట్లు.. రాష్ట్ర నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. గత కొన్ని రోజులుగా బీజేపీ నేత జితేందర్ రెడ్డి.. తెలంగాణ నేతలపై ట్వీట్ చేస్తూ సంచలన కామెంట్స్ చేశారు. బండి నాయకత్వాన్ని ప్రశ్నిస్తే దున్నపోతుల ట్రీట్మెంట్ అని, అంతేకాకుండా ఈటలను ఉద్దేశించి కూడా పరోక్షంగా ట్వీట్ చేశారు జితేందర్. ఆ కామెంట్స్ పై స్పందించిన ఈటల రాజేందర్ ఘాటుగానే స్పదించారు. ఈ పరిణామాల మధ్య.. సోమవారం (జులై 3)న జితేందర్ రెడ్డి ఫామ్ హౌజ్ లో ఈటల రాజేందర్ భేటీ అయ్యారు.

జితేందర్ రెడ్డి కుమారుడు ఈటలను సాదరంగా ఆహ్వానించారు. పరస్పర దూషణలను మర్చిపోయి ఈ ఇద్దరు నేతలు.. పార్టీ విషయాలపై చర్చించారు. దాదాపు గంటపాటు ఈ ఇద్దరి మధ్య ఏకాంత చర్చలు జరిగాయి. తర్వాత జింతేందర్ ఫామ్ హౌజ్ లో లంచ్ ముగించుకుని వెళ్లిపోయారు. ఈ పరిణామాలు చూస్తుంటే.. ప్రస్తుతం బీజేపీ అధిష్టానం కీలక చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కేంద్ర కేబీనెట్ లో భేటీ, ఢిల్లీ నుంచి రాఘునందన్, విశ్వేశ్వర్ రెడ్డిలకు పిలుపు, రాష్ట్ర బీజేపీ చీఫ్ లో మార్పులే కాకుండా ఈటల, జితేందర్ రెడ్డిల భేటీతో... రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. బీజేపీ పెద్ద వార్తలను విడుదల చేశే అవకాశం కనిపిస్తుంది. 




Tags:    

Similar News