మనవరాలితో కలిసి తొలి పూజ.. మెగా ఇంట పండుగ శోఖ.. ఫొటోలు వైరల్

By :  Bharath
Update: 2023-09-18 13:03 GMT

మెగా ఇంట వినాయక చవితి పండగ శోభ వెల్లివిరిసింది. మెగా వారసురాలు క్లీంకారతో కలిసి తొలి వినాయక చవితి వేడుకను ప్రత్యేకంగా జరుపుకున్నారు. దీనిపై ఆనందం వ్యక్తం చేసిన చిరంజీవి సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ పెట్టాడు. తన మనువరాలితో కలిసి తొలి పూజ జరుపుకోవడం ఆనందంగా ఉందంటూ చెప్పుకొచ్చాడు. పూజ అనంతరం ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశాడు. ‘‘అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు! ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో జీవితాల్లో విఘ్నాలు తొలగి అందరికీ శుభములు కలగాలని ప్రార్ధిస్తున్నాను! ఈ సారి ప్రత్యేకత ... చిన్ని 'క్లిన్ కారా' తో కలిసి తొలి వినాయక చవితి జరుపుకోవడం

Happy Ganesh Chaturthi to ALL ! Celebrating the First Festival with the little 'Klin Kaara' this year’’ అంటూ ట్వీట్ చేశాడు. ఇక అదే పోస్ట్ ను రామ్ చరణ్ రీ ట్వీట్ చేసి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పోస్ట్ పై మెగా అభిమానులు ఖుషీ అవుతున్నారు. మెగా ఫ్యామిలీ అంతా ఒకచోట ఉండటం చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News