మూడుముళ్ల బంధంతో ఒక్కటైన వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి..

By :  Krishna
Update: 2023-11-01 17:17 GMT

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠిలు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇటలీలోని టస్కానీలో వీరి పెళ్లి గ్రాండ్గా జరిగింది. కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య రాత్రి 7.18 నిమిషాలకు వరుణ్ లావణ్య మెడలో మూడుముళ్లు వేశారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రాంచరణ్, అల్లు అర్జున్ సహా నితిన్ దంపతులు వీరి పెళ్లిలో సందడి చేశారు. నవంబర్ 5న హైదరాబాద్లో వరుణ్ - లావణ్య రిసెప్షన్ గ్రాండ్గా జరగనుంది.

2017లో వచ్చిన మిస్టర్ సినిమాతో మొదలైన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీల పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. అంతరిక్షం సినిమా సమయంలో వారిద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత చాలా పార్టీల్లో ఈ లవ్ బర్డ్స్ జంటగా తిరిగినా.. బయట కలిసి కనిపించింది మాత్రం చాలా తక్కువే. ఆరేళ్ల ప్రేమ తర్వాత పెళ్లితో వీరిద్దరూ ఒక్కటయ్యారు.


Tags:    

Similar News