హై అలర్ట్.. మరో మూడు రోజులు వర్షాలు!

Byline :  Bharath
Update: 2023-11-24 02:09 GMT

తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారింపోయింది. ఒకపక్క చలి, మరోపక్క ఎండతో ప్రజలు వణికిపోతున్నారు. గురువారం ఒక్కరోజు వాతావరణ సడెన్ గా మారిపోయింది. కాగా రాష్ట్రంలో రానున్న మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈనెల 26 వరకు పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని, భారీ వర్షాలు పడే అవకాశం లేదని వాతావణ శాఖ తెలిపింది. హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, ఉదయం పొగమంచు కమ్మేస్తుందని పేర్కొంది. నిన్నటి నుంచి కురుస్తున్న వర్షానికి వాతావరణం రాష్ట్రంలో మరింత చల్లబడింది.

పొగమంచు, చలిగాలులు వీస్తుండడంతో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్ జిల్లాల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. కాగా రానున్న మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో.. రాజధాని పరిధిలో 23 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుందని అధికారులు తెలిపారు. మంకీ క్యాపులు, స్వెటర్లు, మఫ్లర్లు ధరించి చలిగాలుల పట్ల జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచించారు. అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, అల్లూరి సీతారామ రాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

Tags:    

Similar News