Rain allert: వాతావరణ శాఖ కీలక సూచన.. ఇవాళ, రేపు వర్షాలు

Byline :  Bharath
Update: 2023-11-02 01:51 GMT

గతకొన్ని రోజులుగా మధ్యాహ్నం పూట ఎండ, రాత్రి చలితో.. రాష్ట్ర ప్రజలు రెండు రకాల వాతావరణంతో ఇబ్బంది పడుతున్నారు. ఇక మిగిలిన వరుణుడు కూడా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యాడు. కాగా, ఇవాళ, రేపు రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడొచ్చని ప్రకటించింది. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో కూడా ఇవాళ, రేపు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది.

తమిళనాడులో ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో తెలుగు రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఈ రుతు పవనాల ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతం అయి ఉంటుంది. కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా సూర్యపేట, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాగా రాష్ట్రంలో పగటిపూట ఎండలు మండిపోతున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోయి చలి వణికిస్తోంది.

Tags:    

Similar News