Asaduddin Owaisi : కాంగ్రెస్ రైతుబంధును ఎందుకు అడ్డుకుందో అర్థమైతలేదు : అసదుద్దీన్ ఓవైసీ
రైతు బంధు నిధుల పంపిణీకి ఇచ్చిన అనుమతిని ఈసీ వెనక్కి తీసుకోవడంపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. రైతు బంధు పథకాన్ని కాంగ్రెస్ ఎందుకు అడ్డుకుంటుందో అర్ధం కావడం లేదన్నారు. ఇది కొత్త పథకం అయి ఉంటే అపొచ్చని.. కానీ ఇది పాతదేనని చెప్పారు. రైతుబంధు కింద వచ్చే పంట సాయాన్ని రైతులకు చేరకుండా కాంగ్రెస్ అడ్డుకోవడం కరెక్ట్ కాదని మండిపడ్డారు. ఈ స్కీంను అడ్డుకోవడంలోనే రైతులపట్ల కాంగ్రెస్ వైఖరీ ఏంటో తెలుస్తుందన్నారు. ఈ చర్యతో కాంగ్రెస్ తప్పుడు సంకేతాలు పంపుతున్నట్లు తెలుస్తోందని విమర్శించారు.
కాగా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది. రైతు బంధు నిధుల పంపిణీకి ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంది. దీంతో రైతు బంధు నిధుల పంపిణీకి బ్రేక్ పడింది. నియమాలు ఉల్లంఘించారని ఈసీ అనుమతిని వెనక్కి తీసుకుంది. కాగా మూడు రోజుల క్రితం రైతు బంధు నిధుల పంపిణీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 28లోపు రైతుబంధు నిధులు ఇచ్చేందుకు అనుమతించింది. దీంతో ప్రభుత్వం రైతుల అకౌంట్లలో నిధులు జమచేసేందుకు సిద్ధమైంది. శనివారం, ఆదివారం, సోమవారం సెలవులు కావడంతో.. మంగళవారం నిధులు అకౌంట్లలో జమచేయాలని భావించింది. అయితే ఈసీ తన అనుమతిని వెనక్కి తీసుకోవడంతో దీనికి బ్రేక్ పడింది.