పార్టీల అభిప్రాయాలు తీసుకోనప్పుడు బీఏసీ ఎందుకు..? - Akbaruddin Owais

Byline :  Kiran
Update: 2024-02-16 10:00 GMT

అసెంబ్లీలో కుల గణన తీర్మానం ప్రవేశపెట్టడంపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అభ్యంతరం వ్యక్తంచేశారు. బీఏసీలో చెప్పని అంశాలపై చర్చ ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. కుల గణన తీర్మానంపై చర్చలో భాగంగా మాట్లాడిన ఒవైసీ.. పార్టీల అభిప్రాయాలు తీసుకోనప్పుడు బీఏసీ ఎందుకని ప్రశ్నించారు. సభాకార్యక్రమాలను ఏకపక్షంగా నిర్ణయిస్తున్నారని మండిపడ్డారు.

2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సర్వే నిర్వహించిన విషయాన్ని అక్బరుద్దీన్ గుర్తు చేశారు. ఆ సర్వే వివరాలను ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. సమగ్ర సర్వే వివరాలతో ఎవరికి ప్రయోజనం కలిగిందని ఒవైసీ నిలదీశారు. ఇప్పటికైనా ఆ వివరాలను అధికారికంగా బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

కుల గణనకు తాము వ్యతిరేకం కాదన్న అక్బరుద్దీన్.. దానికి చట్టబద్దత ఉండేలా చూడాలని అన్నారు. అసలు సర్వే ఎవరు నిర్వహిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. తీర్మానంలో ఎస్సీ, ఎస్టీ, బీసీల గురించి మాత్రమే ప్రస్తావించారని ముస్లిం, మైనార్టీల గురించి సర్వే నిర్వహిస్తారా అని ప్రశ్నించారు. ముస్లింలను సైతం తీర్మానం చేర్చాలని అక్బరుద్దీన్ కోరారు. కులగణనకు సంబంధించి బిల్లు తెచ్చి ఆ తర్వాత ఆ తర్వాత ప్రక్రియ మొదలుపెట్టాలని స్పష్టం చేశారు.

Tags:    

Similar News