Ponnam Prabhakar : ప్రతిపక్షాలపై మంత్రి పొన్నం ఫైర్‌

Byline :  Vinitha
Update: 2024-02-17 04:57 GMT

కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం కులగణనపై అసెంబ్లీలో తీర్మానం చేశామన్నారు. ఈ సందర్భంగా మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ కులగణనకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన అందరికి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ ఎవరికి వ్యతిరేకం కాదని...అన్ని పార్టీల ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకున్నామని స్పష్టం చేశారు. మాజీమంత్రి గంగుల కమలాకర్ తీర్మానంపై అనుమానం వ్యక్తం చేయడం శోచనీయమని అన్నారు. గంగులకు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే సకల జనుల సర్వేను బయటపెట్టమని అడిగారా? అంటూ ప్రశ్నించారు.

అనుమానాలు పక్కన పెట్టి..ఇప్పటికే జరిపిన ఆయా రాష్ట్రాల గురించి తెలుసుకోవాలని సూచించారు. మురళీధర్ కమిషన్ నుంచి తెలంగాణ ఉద్యమం, పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం వరకు తాము ఉన్నామని చెప్పుకొచ్చారు. మిగతా వారిలాగా ఎగ్జిక్యూటివ్ ఆదేశాలకే తాము పరిమితం కాలేదని చెప్పారు. అందుకే సభలో తీర్మానం ప్రవేశ పెట్టామని అన్నారు. తీర్మానాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమలు చేస్తామని మంత్రి పొన్నం తెలిపారు.




Tags:    

Similar News