Tamilisai Vs Harish Rao : సుబ్ర‌మణ్య స్వామిని రాజ్య‌స‌భ‌కు ఎలా నామినేట్ చేశారో చెప్పాలి : హరీష్ రావు

Byline :  Krishna
Update: 2023-09-25 11:41 GMT

గవర్నర్ కోటాలో దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను తిరస్కరిస్తూ గవర్నర్ తమిళిసై తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. దీనిపై మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. తమిళిసై బీజేపీ ప్రతినిధిలా వ్యవహరిస్తూ.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆరోపించారు. కేబినెట్ ఆమోదించిన ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను గవర్నర్ ఎలా తిరస్కరిస్తారని ప్రశ్నించారు. సుబ్రమణ్య స్వామిని రాజ్య‌స‌భ‌కు ఎలా నామినేట్ చేశారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

కాగా ఎస్టీ కోటా నుంచి కుర్రా సత్యనారాయణ, బీసీ కోటా నుంచి దాసోజు శ్రవణ్కు అవకాశం ఇవ్వాలని జులై 31న కేబినెట్ నిర్ణయించి.. గవర్నకు సిఫార్సు చేశారు. అయితే ఈ సిఫార్సును గవర్నర్ తిరస్కరించారు. ఆర్టికల్ 171(5) ప్రకారం అభ్యర్థుల ఎంపిక జరగలేదని గవర్నర్ అభిప్రాయపడ్డారు. రాజకీయ నాయకులను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా సిఫార్సు చేయొద్దని రాజ్యాంగంలోని ఆర్టికల్ 171(5) చెబుతోందని గవర్నర్ చెప్పారు. అభ్యర్థులిద్దరూ ఎక్కడా సామాజిక సేవా కార్యక్రమాలు చేసినట్లు కన్పించలేదని స్పష్టం చేశారు. 




Tags:    

Similar News