మిగితా పార్టీలకు దిమ్మతిరిగేలా బీఆర్ఎస్ మేనిఫెస్టో : హరీష్ రావు

Update: 2023-09-29 13:49 GMT

తెలంగాణలో అన్ని వర్గాలు సంతోషడేలా సీఎం కేసీఆర్ త్వరలోనే గుడ్ న్యూస్ చెప్తారని మంత్రి హరీష్ రావు తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ దిమ్మ తిరిగేలా బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో ఉంటుంద‌న్నారు. కాంగ్రెస్, బీజేపీల మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిల్లో లేరని చెప్పారు. బీఆర్ఎస్ వదిలేసిన నేతలను కాంగ్రెస్ తీసుకుంటుదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకే గ్యారెంటీ లేనప్పుడు.. ప్రజలకేం గ్యారెంటీలు ఇస్తారని మంత్రి విమర్శించారు.

కాంగ్రెస్ నాయకులు కరెంట్ గురించి మాట్లాడితే సూర్యుడి మీద ఉమ్మి వేసినట్లే అని హరీష్ రావు అన్నారు. కరెంట్ పాలనలో కరెంట్ కష్టాలు అన్నీఇన్నీ కావన్నారు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ బాగుందా, తమ పాలనలో కరెంటు బాగుందా అని ప్రజలనే అడుదామని.. ఈ అంశం మీదే ఎన్నికలకు వెళ్దామని సవాల్ విసిరారు. కర్నాటక, ఛత్తీస్‌ ఘఢ్‌ రాష్ట్రాల్లో కాంగ్రెస్ 4వేల రూపాయల పెన్షన్ ఎందుకు ఇవ్వట్లేదన్న మంత్రి.. అక్కడ చేతకానిది.. ఇక్కడ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు.

ఆడబిడ్డ ఉన్న తల్లికి కేసీఆర్ కొండంత అండగా మారారని హరీష్ రావు చెప్పారు. ఇంటింటికి మంచినీళ్లు అందించి మహిళ క‌ష్టాలు తీర్చింది సీఎం కేసీఆర్ మాత్ర‌మేన‌ని తెలిపారు. గ‌తంలో ఎమ్మెల్యేలు గ్రామాల‌కు వ‌చ్చే కంటే ముందు.. నీళ్ల ట్యాంక‌ర్లు వ‌చ్చేవ‌ని విమర్శించారు. దేశంలో అత్య‌ధిక పెన్ష‌న్లను తమ ప్రభుత్వమే ఇస్తుందన్న హరీష్ రావు.. వృద్ధులు, వితంతువులు, వికలాంగుల ఆత్మగౌరవం పెంచింది కేసీఆర్ మాత్ర‌మే అని స్పష్టం చేశారు. ప్రజాసంక్షేమానికి పాటుపడుతున్న బీఆర్ఎస్కు ప్రజలు అండగా నిలవాలని కోరారు.


Tags:    

Similar News