‘ఇది కదా జల తెలంగాణ’.. హరీష్ రావు ఎమోషనల్ ట్వీట్

Update: 2023-06-07 17:29 GMT

‘నాడు ఎటు చూసినా తడారిన నేలలు..

నేడు ఎటు చూసినా పరవళ్ళు తొక్కుతున్న గోదారి’ అంటూ మంత్రి హరీష్ రావు ఎమోషనల్ ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సంగారెడ్డి జిల్లా చిన్న చల్మెడలో సంగమేశ్వర ఎత్తిపోత పథకానికి భూమిపూజ చేసిన సందర్భంగా.. హరీష్ రావు ఈ ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.2,653 కోట్లతో ఈ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించనుంది. ఈ పథకం పూర్తయితే సంగారెడ్డి, ఆందోల్‌, జహీరాబాద్‌ నియోజకవర్గాల్లోని 2.19లక్షల ఎకరాలను సాగునీరు అందుతుందని హరీష్ రావు అన్నారు. ఈ ఎత్తిపోతల పథకం కోసం కాళేశ్వరం నుంచి 12 టీఎంసీల నీటిని ప్రభుత్వం కేటాయించింది.

‘నాడు ఎటు చూసినా తడారిన నేలలు..

నేడు ఎటు చూసినా పరవళ్ళు తొక్కుతున్న గోదారి.

నాడు ఎటుచూసినా నోళ్లు తెరచిన బీళ్లు..

నేడు తలలూపుతున్న ఆకుపచ్చని పైర్లు.

ఇది తెలంగాణ జలవిజయం..

కేసీఆర్ సాధించిన ఘన విజయం.

మండుటెండల్లో తడలు గొడుతున్న చెరువులు..

ఊటలు జాలువారుతున్న వాగులు..

పాతళగంగమ్మ పైపైకి ఎగదన్నుతున్న జలదృశ్యాలు.

ఇది కదా జల తెలంగాణ..

ఇది కదా కోటి రతనాల మాగాణ.

దశాబ్ది ఉత్సవాల సందర్భంగా

హృదయ పూర్వక శుభాకాంక్షలు.’ అని హరీష్ ట్వీట్ చేశారు.





Tags:    

Similar News