గతుకుల గజ్వేల్ను బతుకుల గజ్వేల్గా మార్చిండు : హరీష్ రావు

Update: 2023-11-17 10:40 GMT

గతుకుల గజ్వేల్ను బతుకుల గజ్వేల్గా చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు. ఎన్నికల వేళ విపక్షాలు చెప్పే మాయమాటలకు మోసపోవద్దని సూచించారు. గజ్వేల్ నియోజకవర్గంలోని మర్కుక్‌లో మంత్రి రోడ్ షో నిర్వహించారు. మర్కుక్ దశ దిశ మార్చింది కేసీఆర్ అని అన్నారు. నెత్తిమీద గంగమ్మ లెక్క కొండపోచమ్మ సాగర్ తెచ్చారని చెప్పారు. గజ్వేల్ రూపురేఖలు మార్చిన కేసీఆర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

ఈ సారి అధికారంలోకి వస్తే అసైన్డ్ ల్యాండ్స్‌కి పట్టా ఇచ్చి భూ హక్కులు ఇస్తామని హరీష్ రావు హామీ ఇచ్చారు. అదేవిధంగా మార్చి నుంచి సన్నబియ్యం ఇస్తామన్నారు. నాడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన అంటే నేడు పోదాం పద సర్కారు దవాఖాన అంటున్నారని చెప్పారు. సిలిండర్ ధరలు పెంచిన బీజేపీని ప్రశ్నించాలని.. ఈ ఎన్నికల్లో పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అభివృద్ధి మొత్తం ఆగమవుతుందని చెప్పారు.


Tags:    

Similar News