ఎన్నికలు దగ్గరపడుతుండడంతో కేసీఆర్ సర్కార్ కొత్త స్కీంలతో ప్రజల ముందుకు వస్తోంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా స్కీంలను ప్రవేశపెడుతున్నారు గులాబీ బాస్. బీసీలకు లక్ష స్కీంను ఇప్పటికే ప్రకటించిన ప్రభుత్వం.. ఇప్పుడూ మైనార్టీల సంక్షేమంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. బీసీ స్కీం లాగే మైనార్టీలకు లక్ష సాయం ప్రకటించేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
త్వరలో పేద మైనార్టీలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష ఆర్థికసాయం అందిస్తామని మంత్రి హరీష్ రావు తెలిపారు. బ్యాంకులతో సంబంధం లేకుండా దీన్ని అందజేస్తామని చెప్పారు. ఆర్థికసాయంపై ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారన్నారు. దీనిపై రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు జారీ అవుతాయని హరీష్ స్పష్టం చేశారు.