కాంగ్రెస్ ఆచరణకు సాధ్యంకాని హామీలు ఇచ్చింది : హరీష్ రావు

Update: 2023-11-17 11:29 GMT

మేనిఫేస్టోలో కాంగ్రెస్ ఆచరణకు సాధ్యంకాని హామీలను ఇచ్చిందని మంత్రి హరీష్ రావు అన్నారు. 420 మేనిఫెస్టోతో ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమైందని ఆరోపించారు. ధరణి పేరును భూమాతగా మార్చారన్నారు. 2009 మేనిఫెస్టోలో ఉన్న ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఈ పథకాలు అమలవుతున్నాయా అని ప్రశ్నించారు. అక్కడ అమలు చేయలేదు కానీ ఇక్కడ ఎలా అమలు చేస్తారని నిలదీశారు. కర్నాటకలో 5గంటల కరెంట్ కూడా ఇవ్వడం లేదన్నారు

తెలంగాణలో పార్టీలు, కులాలు, మతాలకీతతంగా కేసీఆర్ పాలన సాగుతోందని హరీష్ రావు అన్నారు. గజ్వేల్లో ఓట్ల కోసం ఈటల రాజేందర్ జూటా మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

ఈటలకు రాజకీయ భిక్ష పెట్టిందే కేసీఆర్ అని చెప్పారు. ఈటల తిన్నింటి వాసాలు లెక్కపెడుతున్నారని ఆరోపించారు. గజ్వేల్కు బీజేపీ ఏమిచ్చిందో ఈటల చెప్పాలని డిమాండ్ చేశారు. రూ.400 ఉన్న సిలిండర్ను 1200 చేసింది బీజేపీ కాదా ప్రశ్నించారు. కేసీఆర్ ఏదైన చెప్తే గ్యారెంటీగా చేస్తారని.. ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.


Tags:    

Similar News