కాంగ్రెస్ నేతలు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు - హరీశ్ రావు
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంటు కష్టాలు తప్పవని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆ పార్టీ హయాంలో అవస్థలే తప్ప అభివృద్ధి ఉండదని ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హరీశ్.. అమలు సాధ్యంకాని హామీలతో కాంగ్రెస్ నేతలు మేనిఫెస్టో విడుదల చేశారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని అన్నారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోను నమ్మి ప్రజలు మోసపోవద్దని హరీశ్ సూచించారు. కర్నాటకలో ఇచ్చిన హామీలను వారు ఇప్పటి వరకు అమలు చేయలేదని విమర్శించారు. ఆ పార్టీకి ఎందుకు ఓటేశామా అని అక్కడి ప్రజలు బాధపడుతున్నారని హరీశ్ చెప్పారు. రైతులను ఆదుకునేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు, రైతు బీమా పథకాలను అమలుచేస్తోందని, రూ. 200 ఉన్న పింఛన్‌ను రూ. 2వేలు చేశామని అన్నారు. సౌభాగ్యలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకు నెలనెలా ₹3వేలు, రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి సన్నబియ్యం పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్న హరీశ్‌రావు.. తమ పార్టీకి ఓటేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. వెల్లడించారు.