MRO ఆఫీస్‌లో మంత్రి హరీశ్‌ రావు ఆకస్మిక తనిఖీ

Update: 2023-06-07 07:58 GMT

సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట MRO ఆఫీసును మంత్రి హరీశ్‌ రావు (Minister Harish Rao) ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహశీల్దార్ కార్యాలయంలో ధరణి పనితీరును (Dharani) తనిఖీ చేశారు. అక్కడే ఉన్న రైతులను ధరణి పోర్టల్‌ ద్వారా ఏ విధంగా తమ సమస్యలు పరిష్కారమవుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. ధరణి పోర్టల్ తమకు మేలు చేసిందని మంత్రికి సమాధానం ఇచ్చారు రైతులు. రాష్ట్ర సర్కార్ తమకు మేలు చేసిందని సంతోషం వ్యక్తం చేశారు. గతంలో ధరణి రాకముందు భూమిని ఇంట్లో వాళ్ళ పేరు మీద మార్పించాలన్నా... అధికారుల చుట్టు కాళ్ళు అరిగేలా తిరగాల్సిన పరిస్థితి ఉండేదని, ఇపుడు ధరణి ఆన్ లైన్ లో త్వరగా పనులు అవుతున్నాయన్నారు. ఒకపుడు భూమి అమ్ముకుంటే ఆఫీసర్లకు , దళారులకు లంచాలు ఇస్తేనే రిజిస్ట్రేషన్ , మ్యుటేషన్ పని అవుతుండేద‌ని.. ఇపుడు ఎవరిని కలవాల్సిన అవసరం లేదన్నారు. ధరణిలో అప్లై చేసుకుంటే చెప్పిన డేట్ లో పని పూర్తి చేసి పాస్ బుక్ ఇస్తున్నార‌న్నారు. ధరణి తమకు ప్రయోజనకరంగా ఉందని స్పష్టం చేశారు.



ఇక జిల్లాలోని సంగమేశ్వర ఎత్తిపోతల పథకంతో అందోల్‌, జహీరాబాద్‌, సంగారెడ్డి నియోజకవర్గాల్లోని 2.19 లక్షల ఎకరాలకు సాగునీరందేలా ప్రభుత్వం రూపకల్పన చేసింది. ఈ పనులను సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం చిన్నచెల్మడలో బుధవారం మంత్రి హరీశ్‌రావు ప్రారంభించనున్నారు. ఇక్కడే పంప్‌హౌస్‌ నిర్మాణానికి 35 ఎకరాలను అధికారులు సేకరించారు. 




Tags:    

Similar News