గిరిజనులు, ఆదివాసీలకు మంత్రి హరీష్ రావు శుభాకాంక్షలు

Update: 2023-08-09 05:25 GMT

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మంత్రి హరీష్ రావు ఆదివాసీ, గిరిజనులకు శుభాకాంక్షలు చెప్పారు. సీఎం కేసీఆర్ హయాంలో వారి ఆకాంక్షలు నెరవేరాయని అన్నారు. విధ్వంసపు దారులు వికసిత తోవలుగా మారాయని, మోడువారిన బతుకుల్లో మోదుగు పూల పరిమళాలు వెదజల్లుతున్నాయని మంత్రి ట్వీట్ చేశారు. మా తాండాలో మా రాజ్యం అనే ఆదివాసీ, గిరిజనుల ఆకాంక్షలను కేసీఆర్ నెరవేర్చారని, కొమురం భీం నినాదమైన జల్ జంగల్ జమీన్ ను నిజం చేశారని హరీష్ రావు చెప్పారు.

Tags:    

Similar News