చంద్రబాబు, జగన్‌పై హరీష్ రావు పరోక్ష విమర్శలు

Update: 2023-06-10 15:55 GMT

ఏపీ నాయకులను మరోసారి మంత్రి హరీష్ రావు టార్గెట్ చేశారు. ఆ రాష్ట్ర నాయకులకు మాటలు ఎక్కువ.. చేతలు తక్కువంటూ విమర్శించారు.. ఇద్దరు నేతలు కారణంగానే ఏపీ వెల్లకిలా పడిందన్నారు. హైటెక్ పాలన, అద్భుతమైన అడ్మినిస్ట్రేటర్ అంటూ గొప్పలు చెప్పుకున్నారని చంద్రబాబుపై పరోక్షంగా సెటైర్లు వేశారు. కేసీఆర్ మాత్రం ప్రచారం తక్కువ..పని ఎక్కువ చేశారని కొనియాడారు. పక్క రాష్ట్రం వెళ్లి చూస్తేనే తెలంగాణ అభివృద్ధి ఏంటో తెలుస్తోంది అన్నారు హరీష్. తెలంగాణ వస్తే నక్సలైట్ల రాజ్యం వస్తుందని..హైదరాబాద్‌లో రోజూ కర్ఫ్యూ ఉంటుందన్నారు. పరిపాలన చేత కాదు.. విద్యుత్‌ ఉండదన్నారు. వాటన్నింటినీ పక్కకు నెట్టి తెలంగాణ నేడు దేశానికే దిక్సూచిగా నిలిచిందని హరీష్ తెలిపారు. సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ వస్తే దళారులదే రాజ్యం

కాంగ్రెస్‌పై కూడా హరీష్ రావు విమర్శలు గుప్పించారు. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళారీ వ్యవస్థ రాజ్యామేలుతుందన్నారు. ధరణిపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను హరీష్ తిప్పికొట్టారు.

ధరణి తీసేస్తే.. కాంగ్రెస్ కార్యకర్తలకే రైతు బంధు ఇస్తారని చెప్పారు. ధరణి వల్లే రైతుల సమస్య పరిష్కారం అయ్యిందన్న ఆయన ధరణి రాకముందు రైతుల కష్టాలు చెప్పలేనవని గుర్తు చేశారు. తెలంగాణలో సర్పంచులు అందరూ ఓ బస్సులో గుజరాత్, మహారాష్ట్ర వెళ్లి అక్కడ అభివృద్ధి ఎలా ఉందో చూడాలన్నారు. కేంద్ర, అన్ని రాష్ట్రాల ఉద్యోగుల వేతనాల కంటే ఎక్కువ వేతనాలు పొందుతున్నది తెలంగాణ ఉద్యోగులే అని హరీష్ రావు తెలిపారు.


Tags:    

Similar News