Minister Jupally Krishnarao: బంగారు పళ్లాన్ని చేతిలో పెడితే.. అప్పుల కుప్పగా మార్చాడు.. మంత్రి జూపల్లి

Byline :  Veerendra Prasad
Update: 2024-01-19 07:49 GMT

2014లో తెలంగాణ ప్రజలు బంగారు పళ్లాన్ని కేసీఆర్ చేతిలో పెడితే.. అప్పుల కుప్పగా మంత్రి జూపల్లి కృష్ణారావు మార్చాడని విమర్శించారు. బంగారు తెలంగాణను, అప్పుల తెలంగాణగా బీఆర్ఎస్ మార్చిందని, తొమ్మిదేళ్లలో రూ.7 లక్షల కోట్ల అప్పు చేసిందని తెలిపారు. శుక్రవారం గాంధీభవన్​లో మంత్రి జూపల్లి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుతం కాంగ్రెస్‌ అధికారంలోకి రావడాన్ని జీర్ణించుకోలేక రెండు నెలలకే విమర్శలు ప్రారంభించారని మండిపడ్డారు. వందరోజులు కాకముందే గ్యారంటీలపై రాద్ధాంతం చేయడం తగదన్నారు. గతంలో ప్రతిపక్షాలు బీఆర్ఎస్‌ను రెండేళ్ల తర్వాత విమర్శిస్తే.. రెండేళ్ల పసికందును విమర్శిస్తారా? అని వాపోయినట్లు గుర్తుచేశారు.

2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ అనేక హామీలు ఇచ్చిందని.. అందులో ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయలేకపోయిందని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతోనే బీఆర్ఎస్ పార్టీ ఓటమిపాలైందన్నారు. రహస్యంగా జారీ చేసిన ఎన్నో జీవోలను బీఆర్ఎస్ బహిర్గతం చేయలేదని అన్నారు. కేసీఆర్ పుణ్యమా అని ఇవాళ రూ.40 వేల కోట్లు వడ్డీకే పోతోందని అన్నారు. బీజేపీ తీసుకొచ్చిన ప్రతి బిల్లుకు పార్లమెంట్‌లో బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని వెల్లడించారు. రెండు ఒకటేనన్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల కోసమే.. అదానీని సీఎం రేవంత్‌రెడ్డి కలిశారన్నారు. గత రెండేళ్లలో కృష్ణా బేసిన్‌లో నిండుగా నీరు ఉన్నప్పటికీ సాగుకు నీరు ఇవ్వలేదన్నారు.

ఇక కాంగ్రెస్​ ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేస్తుందని పేర్కొన్నారు మంత్రి జూపల్లి . ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో అధికారంలోకి వచ్చిన రెండ్రోజుల్లోనే రెండు అమలు చేశామని.. మిగతా నాలుగు గ్యారంటీల అమలు కోసమే ప్రజాపాలన పేరుతో దరఖాస్తులు స్వీకరించామని తెలిపారు. దరఖాస్తుల పరిశీలన పూర్తికాగానే దశలవారీగా మిగిలిన వాటిని అమలు చేస్తామని హామీ ఇచ్చారు




Tags:    

Similar News