యాదాద్రి ప్రాజెక్టులో పెద్ద కుంభకోణం.. మంత్రి కోమటిరెడ్డి

Byline :  Veerendra Prasad
Update: 2023-12-21 06:59 GMT

అసెంబ్లీలో విద్యుత్ రంగంపై శ్వేతపత్రంపై జరిగిన చర్చ వాడీవేడిగా సాగుతోంది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడిచింది. ఫ్రీ కరెంట్ పెటెంట్ కాంగ్రెస్ దే అని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నేతలకు ప్రభాకర్ రావు దోచిపెట్టారన్నారు. విద్యుత్ రంగంలో అవకతవకలపై విచారణ చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. దొంగలు, అవినీతి అంటే భుజాలు తడుముకుంటున్నారన్నారు.

ఎవరు ఎంత తిన్నారో అంత కక్కిస్తాం.. వదిలేస్తామా అన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ లో పెద్ద కుంభకోణం జరిగిందని, ఇందులో జగదీశ్ రెడ్డి రూ.10 వేల కోట్లు తిన్నాడని ఆరోపించారు. మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యేకు కూడా ఇందులో వాటా ఉందని అన్నారు. అసలు టెండర్ లేకుండా పవర్ ప్లాంట్ పెట్టారన్నారు. . బీఆర్ఎస్ 24 గంటల విద్యుత్ ఇచ్చిందనేది పచ్చి అబద్ధమన్నారు. దీనికి స్పందించిన జగదీష్ రెడ్డి నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఆరోపణలపై ఏ విచారణకైనా సిద్ధమన్నారు. మంత్రి కోమటిరెడ్డి పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నాడని అన్నారు. తాము అన్ని రంగాలకు 24 గంటల కరెంట్ ఇచ్చామన్నారు. 

Tags:    

Similar News