కేసీఆర్ ముక్కు నేలకు రాసి నల్గొండ రావాలి : KomatiReddy

Byline :  Krishna
Update: 2024-02-11 08:33 GMT

కాంగ్రెస్ - బీఆర్ఎస్ మధ్య జల జగడం ముదురుతోంది. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నిర్వహణను కేఆర్ఎంబీకి అప్పగించారంటూ కాంగ్రెస్ తీరుపై బీఆర్ఎస్ ఫైర్ అవుతోంది. కాంగ్రెస్ తీరును నిరసిస్తూ ఈ నెల 13న నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. గులాబీ బాస్ కేసీఆర్ ఈ సభకు హాజరుకానున్నారు. ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డి కేసీఆర్ విమర్శలు గుప్పించారు. జిల్లా ప్రజలకు సారీ చెప్పిన తర్వాతే కేసీఆర్ నల్గొండ రావాలని అన్నారు.

గతంలో కేసీఆర్ కూర్చి వేసుకుని కుసోని మరీ ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ పూర్తిచేస్తామని మాట తప్పారని కోమటిరెడ్డి విమర్శించారు. కాబట్టి ముక్కు నేలకు రాసి నల్గొండకు రావాలన్నారు. కేసీఆర్ పర్యటనకు వ్యతిరేకంగా నల్గొండలో నిరసనలు చేపడతామని చెప్పారు. ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగింత ఫైలుపై సంతకం చేసిందే కేసీఆర్, హరీశ్ రావు అని ఆరోపించారు. రాష్ట్ర బడ్జెట్ను విమర్శించే అర్హత బీఆర్ఎస్కు లేదన్నారు. బడ్జెట్లో అన్నీ రంగాలకు

సమ ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు.

కేసీఆర్ వల్లే రాష్ట్రంపై ఆర్థిక భారం పడిందని కోమటిరెడ్డి ఆరోపించారు. బడ్జెట్ను విమర్శిస్తున్న కేటీఆర్, హరీష్ రావులు మూర్ఖులంటూ మండిపడ్డారు. బడ్జెట్లో 13శాతం గత ప్రభుత్వం చేసిన అప్పుల చెల్లింపులకే పోతుందన్నారు. అయినా తమ ప్రభుత్వా ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు. ఎన్నికల వేళ చెప్పినట్లుగా ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. సాధారణ బడ్జెట్ గొప్పగా ఉంటుందని చెప్పారు.

Tags:    

Similar News