ఇద్దరం కలిసి ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేద్దాం: కోమటిరెడ్డి
రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య సవాల్, ప్రతి సవాల్ నడుస్తుంది. దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీ.. ఎంపీ ఎన్నికల్లో గెలిచి చూపించాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. దానికి ప్రతిసవాల్ విసిరిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. రేవంత్ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేయాలని, ఇద్దరం కలిసి మల్కాజ్ గిరి నుంచి పోటీ చేద్దామని అన్న విషయం తెలిసిందే. తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కేటీఆర్‌కు సవాల్ విసిరారు. ఇద్దరం ఎమ్మెల్యేలుగా రాజీనామా చేద్దామని అన్నారు. తాను సిరిసిల్లలో పోటీ చేస్తే. తనపై కేటీఆర్ గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని తేల్చి చెప్పారు. సిరిసిల్లలో కేటీఆర్ ఓడితే బీఆర్ఎస్ ను మూసివేస్తామని ప్రకటించాలని కోమటిరెడ్డి సవాల్ చేశారు.
కేటీఆర్ కు టెక్నికల్ నాలెడ్జ్ లేదని ఆయన విమర్శించారు. కేటీఆర్ ఓ చిన్న పిల్లాడని, తన స్థాయిని మర్చి మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. కేటీఆర్ కు క్యారెక్టర్ లేదు. లక్షల కోట్లు మాత్రమే ఉన్నాయని ఆరోపించారు. 200 కోట్లు ఖర్చు చేసి, 30 వేల మెజార్టీతో సిరిసిల్లలో గెలిచాడని అన్నారు. తాను అలా గెలిచుంటే పదవికి రాజీనామా చేసేవాడినని అన్నారు.