ఏపీ భవన్ విభజనలో ఎలాంటి వివాదం లేదు - మంత్రి కోమటిరెడ్డి

Byline :  Kiran
Update: 2023-12-12 06:49 GMT

ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఏపీ భవన్ను పరిశీలించారు. హస్తినలో తెలంగాణ భవన్‌ నిర్మాణంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీ భవన్ విభజనలో ఎలాంటి వివాదం లేదని అన్నారు. గత ప్రభుత్వ విధానానికి భిన్నమైన వైఖరి తాము తీసుకుంటామని చెప్పారు. రీజినల్ రింగ్ రోడ్డు తెలంగాణకు మరొక మణిహారమని, ట్రిపుల్‌ ఆర్‌ సహా పలు జాతీయ రహదారుల అంశాలపై మాట్లాడేందుకు నేషనల్ హైవే అథారిటీ ఛైర్మన్‌ను కలవనున్నట్లు వెంకట్ రెడ్డి ప్రకటించారు. రెండు నెలల్లో ట్రిపుల్‌ఆర్‌ నిర్మాణానికి టెండర్లు పిలుస్తామని మంత్రి స్పష్టం చేశారు.

మరోవైపు మంత్రి కోమటిరెడ్డి ఢిల్లీలో ప్రత్యేక హోదా పోరాట సమితి ప్రతినిధులు కలిశారు. అనంతరం మాట్లాడిన ఆయన.. రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి పీఎం మన్మోహన్‌ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికీ విభజన చట్టం అమలుపరచకపోవడం బాధాకరమని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఇందుకోసం తన వంతు ప్రయత్నం చేస్తాననని వెంకట్ రెడ్డి హామీ ఇచ్చారు.

Tags:    

Similar News