Konda Surekha: మహేందర్ రెడ్డి ఏమైనా లిక్కర్‌ స్కాం చేశారా?.. కవితకు కొండా సురేఖ స్ట్రాంగ్ కౌంటర్

Update: 2024-02-08 10:18 GMT

కాంగ్రెస్‌ పాలనపై, టీఎస్ పీఎస్సీ చైర్మన్ గా మహేందర్ రెడ్డి నియామకంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన విమర్శలపై మంత్రి కొండా సురేఖ (Konda Surekha) కౌంటర్‌ ఇచ్చారు. ఆమె మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని విమర్శించారు. అసెంబ్లీ పాయింట్‌ వద్ద మీడియాతో మాట్లాడుతూ... ‘‘బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ యువతకు న్యాయం చేయలేదు. వారి భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. మా ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కూడా పూర్తి కాలేదు. రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన వాళ్లు ఇప్పుడు మాపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉంది అని అన్నారు.

టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా మహేందర్‌రెడ్డి నియామకం జరిగి రెండు వారాలే అయిందని అప్పుడే ఆయనపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. 36 ఏళ్లుగా ఆయన వివిధ హోదాల్లో పని చేశారని ఆయన ఏమైనా లిక్కర్ స్కామ్ చేశారా? లేకా పేపర్లు లీక్ చేశారా? అని సెటైర్లు వేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కూడా పూర్తి కాలేదని, రాష్ట్రాన్ని పదేళ్ల పాటు పాలించిన వారు అప్పుడే మాపై ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆంధ్ర కాంట్రాక్టర్లను పెంచి పోషించింది కేసీఆర్ కుటుంబమే అన్నారు. సింగరేణిలో 20 వేల ఉద్యోగాలు తామే ఇచ్చామని చెప్పుకోవడానికి కవిత సిగ్గుపడాలన్నారు. సింగరేణు నిధులు సిరిసిల్ల, గజ్వేల్ కు తరలించుకుపోయింది ఎవరని ప్రశ్నించారు. మాట నిలబెట్టుకుంటామనే అక్కసుతోనే తమపై విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

Tags:    

Similar News