బీఆర్ఎస్ ర్యాలీలో అపశృతి.. వాహనంపై నుంచి పడ్డ కేటీఆర్

Update: 2023-11-09 10:08 GMT

నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ నామినేషన్‌ ర్యాలీలో అపశ్రుతి చోటుచేసుకుంది. బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి నామినేషన్‌ కార్యక్రమానికి హాజరైన మంత్రి కేటీఆర్‌ కు ప్రమాదం ఎదురైంది. పార్టీశ్రేణులంతా జీవన్ రెడ్డి నామినేషన్ కోసమని ర్యాలీగా రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి ప్రచార రథంలో బయల్దేరారు. ఆ క్రమంలో డ్రైవర్ ఒక్కసారిగా సడెన్ బ్రేక్ వేయడంతో మంత్రి కేటీఆర్‌తోపాటు ఎంపీ సురేష్‌రెడ్డి, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కూడా ప్రచార రథంపై నుంచి కిందపడ్డారు. ఈ ప్రమాదంలో మంత్రికి, ఇతర నేతలకు స్వల్ప గాయాలయ్యాయి.

వాహన డ్రైవర్‌ సడెన్ బ్రేక్‌ వేయడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు స్పష్టమవుతోంది. సడన్‌ బ్రేక్‌తో వాహన రెయిలింగ్‌ ఊడిపోవడంతో వారంతా కిందపడ్డారు. ఈ క్రమంలో వాహనం పైనుంచి కింద పడిన కేటీఆర్‌ను భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై పట్టుకున్నారు. ఈ ఘటనలో ఎంపీకి సురేష్ రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. ఆర్మూర్‌ పట్టణంలోని పాత ఆలూర్‌ రోడ్డు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఎవరికీ ఏం కాకపోవడంతో జీవన్‌రెడ్డితో పాటు కేటీఆర్‌ నామినేషన్‌ కేంద్రానికి వెళ్లారు.


Tags:    

Similar News