కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంట్ ఖతం : కేటీఆర్

Update: 2023-11-08 15:38 GMT

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంట్ పని ఖతం అని మంత్రి కేటీఆర అన్నారు. కాంగ్రెస్ కావాలో.. కరెంట్ కావాలో ప్రజలు ఆలోచించుకోవాలని సూచించారు. సంగారెడ్డిలో బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ కు మద్ధతుగా రోడ్ షో నిర్వహించిన కేటీఆర్.. ఆ తర్వాత నిర్వహించిన విద్యార్థి ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. కర్నాటకలో కాంగ్రెస్ వచ్చింది.. కరెంట్ పోయిందని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు.

ఎన్నికలు రాగానే కాంగ్రెస్ నేతలు వచ్చి.. ఏవేవో మాయమాటలు చెబుతారని వాటిని నమ్మొద్దని కేటీఆర్ కోరారు. 55 ఏళ్లు అధికారంలో ఉండి ఏమీ చేయలేకపోయిన కాంగ్రెస్‌ నేతలు.. మళ్లీ ఉద్దరిస్తామని తిరుగుతున్నారని విమర్శించారు. రాహుల్ గాంధీ.. బీజేపీకి బీఆర్ఎస బీ టీం అని అంటున్నారని.. తాము ఎవరికి ఏ టీం కాదన్నారు. బీజేపీతో కేసీఆర్ ఎన్నటికీ కలవరని.. తమది సెక్యులర్ పార్టీ అని చెప్పారు. కవితను అరెస్ట్ చేయలేదని.. బీజేపీ - బీఆర్ఎస్ ఒక్కటే అంటున్నారని.. మరి రాహుల్, సోనియాలను ఎందుకు అరెస్ట్ చేయలేదని నిలదీశారు.


Tags:    

Similar News