కేంద్రంలో ఈ సారి సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడ్తది : కేటీఆర్

Update: 2023-08-12 10:35 GMT

మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ఈ సారి సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడుతుందన్నారు. బీఆర్ఎస్ మద్ధతు లేకుండా కేంద్రంలో ప్రభుత్వం కొలవుదీరే అవకాశం లేదన్నారు.

మనం కేంద్రాన్ని శాసించే స్థాయిలో ఉంటేనే తెలంగాణ అన్ని రకాలుగా పురోగతి సాధిస్తుందన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు ఢిల్లీకి బానిసలు అని .. వారి వల్ల తెలంగాణకు ఎటువంటి లాభం లేదన్నారు. పార్లమెంట్లో మన మాట నెగ్గించుకోవాలంటే బీఆర్ఎస్కు అత్యధిక ఎంపీ సీట్లను కట్టబెట్టాలని పిలుపునిచ్చారు.

భువనగిరి జిల్లా పోచంపల్లిలో జరిగిన చేనేత సమావేశంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా చేనేతలకు కేటీఆర్ గుడ్ న్యూస్ తెలిపారు. త్వరలోనే చేనేత రుణమాఫీపై నిర్ణయం తీసుకుంటామన్నారు. సీఎం కేసీఆర్తో చర్చించి రుణమాఫీ అమలుకు చర్యలు తీసుకుంటామన్నారు. చేనేత వస్త్రాలపై 5 శాతం జీఎస్టీ విధించి 75 ఏళ్లలో ఏ ప్రధాని చేయని తప్పిదాన్ని నరేంద్ర మోదీ చేశారన్నారు. కోకాపేటలో 2 ఎకరాల స్థలంలో చేనేత భవనాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. చేనేతకు చేయూత కార్యక్రమంతో లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా డబ్బులను జమ చేస్తున్నామన్నారు.

మోదీ ప్రభుత్వం చేనేత కార్మికులకు అన్యాయం చేస్తుంటే.. బీఆర్ఎస్ వారికి అన్ని విధాల అండగా నిలుస్తుందన్నారు. పోచంపల్లి చేనేత పార్కును పునరుద్ధరించి ఇక్కడి నేత కార్మికులకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలని ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మగ్గాలను ఆధునీకరించేందుకు రూ.40 కోట్ల నిధులు ఇస్తున్నారు. చేనేత హెల్త్ కార్డు ద్వారా ఉచితంగా వైద్యం అందిస్తున్నామని తెలిపారు. చేనేత కార్మికుడు మరణిస్తే అంత్యక్రియలకు ఇచ్చే పైసలను రూ.5 వేల నుంచి రూ. 25 వేలకు పెంచినట్లు కేటీఆర్ స్పష్టం చేశారు.

 

 

Tags:    

Similar News