ఇది దేశంలోనే మొదటిది కావడం.. తెలంగాణకు గర్వ కారణం’: కేటీఆర్

By :  Bharath
Update: 2023-10-01 16:02 GMT

హైదరాబాద్ లోని నార్సింగి వద్ద 23 కిలోమీటర్ల మేర సోలార్ సైకిల్ ట్రాక్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ సోలార్ సైకిల్ ట్రాక్.. దేశంలోనే మొదటిది కావడం విశేషం అని కేటీఆర్ అన్నారు. నానక్రాంగూడ నుంచి టీఎస్పీఏ వరకు దాదాపు 9 కిలీమీటర్లు, నార్సింగి నుంచి కొల్లూరు వరకు దాదాపు 14 కిలోమీటర్ల మేర మూడు లేన్ లతో సైకిల్ ట్రాక్ ఏర్పాటుచేశారు. ఈ ట్రాక్ 4.5 మీటర్ల వెడల్పు, ఇరు వైపులా ఒక మీటర్ గ్రీన్ స్పేస్, 21 కిలోమీటర్ల సోలార్ రూఫ్ తో పాటు, లైట్స్ ను కూడా ఏర్పాటు చేశారు. ఈ సోలార్ సైకిల్ ట్రాక్ పై సైక్లిస్ట్ ల కోసం ప్రత్యేకంగా పార్కింగ్, టాయిలెట్స్ ఏర్పాటుచేశారు.

మొత్తం 23 కిలోమీటర్లు ఉన్న ఈ ట్రాక్ పై.. 21 కిలోమీటర్ల మేర సోలార్ రూఫ్ టాప్ ఉంటుంది. దీనివల్ల 16 మెగావాట్ల సోలార్ ఉత్పత్తి అవుతుందని హెచ్ఎండీఏ తెలిపింది. ఇందులో ఒక మెగా వాట్ ను సైకిల్ ట్రాక్ కు ఉపయోగిస్తారు. మిగిలిన 15 వాట్ల విద్యుత్ ను అవుటర్ రింగ్ రోడ్డు చుట్టూ ఉన్న స్ట్రీట్ లైట్స్ కు ఉపయోగిస్తారు. అయితే ఈ సైకిల్ ట్రాక్ 24 గంటలు అందుబాటులో ఉంటుందని, ట్రాక్ చుట్టూ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేశామని హెచ్ఎండీఏ తెలిపింది.



Tags:    

Similar News