అ పని చేయను.. దయలేకపోతే ఇంట్లో కూర్చుంటా.. కేటీఆర్

Update: 2023-08-08 13:41 GMT

బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తన గెలుపు కోసం మద్యం, నగదు పంపిణీ చేయబోనని తెలిపారు. గతంలో కూడా ఓట్ల కోసం మందు పోసింది, పైసలు పంచింది లేదన్నారు. ప్రజల దయ ఉంటే గెలుస్తా అని..లేకపోతే ఇంట్లో కూర్చొంటా అని చెప్పారు. మందు పోయించి.. పైస‌లు పంచే చిల్ల‌ర రాజ‌కీయం తనది కాదని కేటీఆర్ తెలిపారు.

రాజ‌న్న సిరిసిల్ల క‌లెక్ట‌రేట్‌లో బీసీ బంధు ప‌థ‌కం చెక్కుల పంపిణీ కార్య‌క్ర‌మంలో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.

ప్ర‌జ‌లంద‌రికీ అండ‌గా ఉండే బాధ్య‌త తనది అన్నారు.కేసీఆర్ సీఎంగా ఉన్నంత వ‌ర‌కు రాష్ట్రానికి డోకా లేదన్న కేటీఆర్.. సెప్టెంబ‌ర్‌లో సిరిసిల్ల‌లో మెడిక‌ల్ కాలేజీని సీఎం ప్రారంభిస్తారని తెలిపారు. రాష్ట్రంలో కడుపులో పడ్డ బిడ్డ నుంచి వృద్ధుల వరకు అందరికి ప్రభుత్వ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. పేద‌ల మీద కేసీఆర్‌కు ఉన్న ప్రేమ ఇత‌రుల‌కు ఎవ్వ‌రికీ లేద‌న్నారు. ఎవ‌రూ అడక్కున్నా.. ప్ర‌తిప‌క్షాలు డిమాండ్ చేయ‌కున్నా సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. ద‌ళితుల అభివృద్ధి కోసం రూ. 10 ల‌క్ష‌ల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. బీసీ, ఎంబీసీల్లోని 14 కుల‌వృత్తులు చేసుకునేవారికి రూ. ల‌క్ష సాయం అందిస్తున్నాం. రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలో ఈ నెల‌లో 600 మంది ల‌బ్దిదారుల‌కు రూ. ల‌క్ష చొప్పున సాయం చేసిన‌ట్లు పేర్కొన్నారు. ప్ర‌తి నెల నియోజ‌క‌వ‌ర్గానికి 300 మందికి రూ. ల‌క్ష చొప్పున సాయం ఇస్తామ‌ని కేటీఆర్ హామీ ఇచ్చారు.


Tags:    

Similar News