ఆరున్నర సం.లు మాత్రమే పనిచేసే అవకాశం దొరికింది.. మంత్రి కేటీఆర్

Update: 2023-11-24 08:25 GMT

బీఆర్ఎస్ పథకాలు ప్రతి గడపకూ చేరాయని, దేశానికే ఆదర్శంగా ఈ పథకాలు నిలుస్తున్నాయన్నారు మంత్రి కేటీఆర్. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ పథకాలు సంక్షేమంలో స్వర్ణయుగాన్ని సృష్టించాయన్నారు. హైదరాబాద్ లోని హెచ్‌ఐసీసీలో క్రెడాయ్‌ ఆధ్వర్యంలో స్థిరాస్తి శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు మంత్రి కేటీఆర్‌. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చి తొమ్మిదిన్నరేళ్లు అయ్యిందని, తొమ్మిదిన్నరేళ్లలో కొవిడ్‌, ఎన్నికల వల్ల ఆరున్నర సంవత్సరాలు మాత్రమే మాకు సమర్థవంతంగా పనిచేసే అవకాశం దొరికిందని, ప్రజల కోసం పని చేశామన్నారు. ఒక వైపు ఐటీ పెరిగిందని.. అదే సమయంలో వ్యవసాయం పెరిగింది. పంజాబ్, హర్యానా రాష్ట్రాలను దాటి దేశంలో వరి ఉత్పత్తిలో తెలంగాణ స్టేట్ నెంబర్ వన్ అయ్యిందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

ప్రజలకు సంబంధం లేని అంశాలపై విపక్షాలు మాట్లాడుతున్నాయన్నారు కేటీఆర్. తమకు తెలంగాణపై అహంకారం కాదు.. మమకారం ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో గెలవగానే ప్రతి ఒక్కరికీ ఇళ్లు ఉండేలా కృషి చేస్తామన్నారు. రాష్ట్రంలో 100 శాతం అక్షరాస్యత కోసం కృషి చేస్తామన్నారు. అప్పు తీసుకుని ఇళ్ళు కొంటున్న మధ్య తరగతి వారికి ప్రభుత్వం తరపున సహకారం ఇవ్వడంపై కేసీఆర్ ఆలోచన చేస్తున్నారు అని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి కేసీఆర్‌ హ్యాట్రిక్‌ సీఎం అవుతారు అని ధీమా వ్యక్తం చేశారు.

మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ నగర అభివృద్ధిపై కొన్ని ఆలోచనలు చేశామని మంత్రి కేటీఆర్ తెలిపారు. వాటిని అమలు చేస్తామన్నారు. హైదరాబాద్ లో ప్రధాన రోడ్లలో సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేయాలని ఆలోచన ఉందన్నారు. మెట్రో రైలు స్టేషన్ల నుంచి శటిల్ సర్వీసులు తీసుకు వస్తామని చెప్పారు. హైదరాబాద్ లో మరిన్ని పార్క్ లను , గ్రీనరీనీ అభివృద్ధి చేస్తుంది అని ఆయన చెప్పారు. హైదరాబాద్ లో కాలుష్యం తగ్గించేందుకు ఈవీ వెహికిల్స్ కు ప్రాధాన్యత ఇస్తామని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లో 24 గంటలు నిరంతర నీటిని ఇస్తామన్నారు. ప్రైవేట్ ట్రాన్స్ ఫోర్ట్ బలంగా ఉంటేనే హైదరాబాద్ గ్లోబల్ నగరం అవుతుంది.. వచ్చే అయిదేళ్లలో మెట్రో 250 కిలోమీటర్లు విస్తరణ చేస్తున్నామన్నారు. మెట్రోను డబుల్ డెక్కర్ చేయాలని ఆలోచన ఉందని.. ఆ తరవాత ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో తీసుకురావాలని ఆలోచన చేస్తున్నామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.



Tags:    

Similar News