జనంలో ఉండే ఎమ్మెల్యే కావాలా.. జైలుకు పోయే ఎమ్మెల్యేనా..? : కేటీఆర్

Update: 2023-11-09 13:25 GMT

కొడంగల్ పేరును అంతర్జాతీయంగా చెడగొట్టిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని మంత్రి కేటీఆర్ విమర్శించారు. జనంలో ఉండే ఎమ్మెల్యే కావాలా.. జైలుకు పోయే ఎమ్మెల్యే కావాలా అని ప్రశ్నించారు. పట్నం నరేందర్ రెడ్డిని గెలిపిస్తే.. సీఎం కేసీఆర్కు చెప్పి ప్రమోషన్ ఇప్పిస్తామన్నారు. అదేవిధంగా కొడంగల్ నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. కొడంగల్ నియోజకవర్గంలో కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. 50లక్షలతో రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికాడని.. ఆయన లీడర్లను కొనచ్చేమోగానీ ప్రజలను కొనలేడన్నారు.

వచ్చే రెండేళ్లలో కొడంగల్లోని 1.25లక్షల ఎకరాలకు కృష్ణా నీరు తీసుకొస్తామని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ను గెలిపిస్తే.. కొడంగల్లో ఆర్డీవో ఆఫీస్, ఇండస్ట్రియల్ పార్క్, ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటు చేసే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు. కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కరెంట్ పోయిందన్నారు. తెలంగాణలో 24గంటల కరెంట్ ఇస్తుంటే.. కర్నాటకలో 5గంటల కరెంట్ కూడా సరిగ్గా ఇవ్వడం లేదని ఆరోనించారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలు నమ్మకుండా బీఆర్ఎస్ను గెలిపించి అభివృద్ధికి పట్టం కట్టాలని కోరారు.


Tags:    

Similar News