ఫ్లై ఓవర్ ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించిన కేటీఆర్

Update: 2023-06-21 10:45 GMT

హైదరాబాద్లోని ఎల్బీనగర్ సమీపంలో ప్రమాదం జరిగింది. సాగర్ రింగ్ రోడ్డు చౌరాస్థాలో నిర్మిస్తున్న ఫ్లైఓవర్ ర్యాంప్ కూలింది. ఈ ప్రమాదంలో 10 మంది కార్మికులకు గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడ్డ వారికి హుటాహుటిన సికింద్రాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై ఆరాతీసిర మంత్రి కేటీఆర్.. హాస్పిటల్ లో అడ్మిట్ అయిన వారిని కలిసి పరామర్శించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం వారికి పూర్తి అండగా ఉంటుందని, చికిత్సకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తుందని, ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేటీఆర్ భరోసా ఇచ్చారు.

జరిగిన ఘటన దురదృష్టకరం అన్న కేటీఆర్.. ఈ ప్రమాదం పట్ల మునిసిపల్ కార్పొరేషన్ పూర్తి బాధ్యత వహిస్తుందని తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై జీహెచ్ఎంసీతో పాటు జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఓ కమిటీ ఏర్పాటు చేసి విచారణ చేపడతామని అన్నారు. వర్కింగ్ కమిటీ వల్ల ఈ ప్రమాదం జరిగిందని తేలితే.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

Tags:    

Similar News