Guvvala Balaraju : గువ్వల బాలరాజుపై దాడిని ఖండిస్తున్నా.. మంత్రి కేటీఆర్

Byline :  Veerendra Prasad
Update: 2023-11-12 06:57 GMT

అచ్చంపేటలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై దాడిని మంత్రి కేటీఆర్ (KTR) ఖండించారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గువ్వల బాలరాజును కేటీఆర్‌ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ఇలాంటి సంస్కృతి ఎప్పుడూ చూడలేదన్నారు. రౌడీ రాజకీయాన్ని సహించమని చెప్పారు. ఓటమి ఫ్రస్టేషన్‌తో దాడులు చేస్తున్నారని విమర్శించారు. రేపు ఇదే పరిస్థితి వాళ్లకు కూడా రావొచ్చని చెప్పారు. బాలరాజుకు భద్రత పెంచాలని డిజీపీ అంజనీ కుమార్‌ను కోరుతున్నామన్నారు. మొన్న దుబ్బాకలో కొత్త ప్రభాకర్‌ రెడ్డిపై దాడి చేశారని చెప్పారు. ఎన్నికల్లో గెలవాలంటే ప్రజలను మెప్పించాలన్నారు. తెలంగాణలో వచ్చేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.

మరోవైపు దాడి ఘటనలో బాలరాజుకు తీవ్రగాయాలు కావడంపై కన్నీటి పర్యంతం అయ్యారు ఆయన సతీమణి గువ్వల అమల. ప్రచారంలో ఎక్కడికి వెళ్తే అక్కడ దాడులు చేస్తుండటంపై ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి జరిగిన దాడుల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీకృష్ణ దాడి చేసినట్లు గువ్వల అమల ఆరోపించారు. తన భర్తకు ఏమవుతుందోనని భయంగా ఉందని.. సింపతీ పాలిటిక్స్‌ చేయాల్సిన అవసరం తమకు లేదంటూ గువ్వల అమల పేర్కొన్నారు. తమపై వరుసగా దాడులు జరుగుతున్నాయని.. బాలరాజు ఏ ఊరికి వెళ్తే అక్కడ దాడులు చేస్తున్నారు.. అంటూ కన్నీంటిపర్యంతమయ్యారు.




Tags:    

Similar News