Malla Reddy: జుంబా డ్యాన్స్లు, డీజే స్టెప్పులు.. మల్లారెడ్డితో మామూలుగా ఉండదు మరి

By :  Bharath
Update: 2023-09-30 07:06 GMT

ఎనర్జీలో నాకెవ్వరు సాటి రారు.. డ్యాన్స్‌లో నాకెవ్వరు పోటీ లేరు అంటున్నారు మంత్రి మల్లారెడ్డి. వేదిక ఏదైనా సరే.. మల్లారెడ్డి ఉన్నారంటే ఉత్సాహం ఉప్పొంగాల్సిందేనని మరోసారి నిరూపించారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా కూకట్ పల్లిలోని మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన 5కే రన్ కార్యక్రమాన్ని మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 16 ఏళ్ల కుర్రాడిలా రెచ్చిపోయారు మల్లారెడ్డి. ఈ సందర్భంగా యువతతో సమానంగా డ్యాన్స్ చేశారు. జుంబా, డీజే టిల్లు సినిమా పాటలకు అదిరిపోయే స్టెప్పులేసి అలరించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత యాంత్రిక జీవితంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపైన దృష్టి పెట్టాలని సూచించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన జీవితం గడపాలని కోరారు. అప్పుడే హార్ట్ ఎటాక్ వంటివి నివారించవచ్చని యువతకు సూచించారు. నిత్యం వ్యాయామం, యోగా చేస్తున్న కారణంగా తాను 70 ఏళ్ల వయసులో కూడా ఆరోగ్యంగా ఉన్నానని తెలిపారు.

Full View

Tags:    

Similar News