పార్టీ ఏదైనా.. అక్కడ అభ్యర్థిని నిర్ణయించేది నేనే : Malla Reddy

Update: 2023-08-03 09:44 GMT

మంత్రి మల్లారెడ్డి మాట్లాడితే మామూలుగా ఉండదు. ఆయన ఏం మాట్లాడిన హల్చల్ ఉంటది. ఆయన మాటలకు సోషల్ మీడియాలో మస్త్ ఫ్యాన్స్ ఉంటారు. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతారా అని ఎదరుచూస్తుంటారు. ఇప్పటికే తన మాటలతో నెట్టింట ట్రెండింగ్గా నిలిచిన Malla Reddy.. మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసి కొత్త చర్చకు తెరలేపారు.

మేడ్చల్లో ఏ పార్టీ అభ్యర్థినైనా తానే నిర్ణయిస్తానని బాంబ్ పేల్చారు మల్లారెడ్డి. తనకు అన్ని పార్టీల్లో మంచి మిత్రులున్నారని చెప్పారు. గత ఎన్నికల్లో కిచ్చన్నగారి లక్ష్మారెడ్డికి మేడ్చల్ Congress టిక్కెట్ తానే ఇప్పించానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సారి కూడా తన గెలుపును ఎవరు అడ్డుకోలేరని. ధీమా వ్యక్తం చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి తొడగొట్టి సవాల్ విసిరిన తర్వాత తన గ్రాఫ్ మరింత పెరిగిందని చెప్పారు.

కొంతమండి మీడియాలో తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని.. త్వరలోనే మీడియా సంస్థ ప్రారంభిస్తానని చెప్పారు. అదేవిధంగా తెలంగాణ యాసలో ఏడాదికి నాలుగు సినిమాలు తీస్తానని వివరించారు. ప్రస్తుతం మల్లారెడ్డి కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి.


Tags:    

Similar News