జీహెచ్ఎంసీలో 10 లక్షల దరఖాస్తులు స్వీకరించాం : Ponnam Prabhakar

Byline :  Krishna
Update: 2024-01-03 14:54 GMT

తెలంగాణలో ప్రజా పాలన అభయహస్తం కార్యక్రమం కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ పరిధిలో 10 లక్షల దరఖాస్తులు స్వీకరించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, పెన్షన్, మహాలక్ష్మీ, సబ్సిడీ గ్యాస్‌లకు సంబంధించిన దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి నెల రోజులు పూర్తైన నేపథ్యంలో ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమల్లోకి తెస్తున్నట్లు తెలిపారు.

ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు ఆరున్నర కోట్ల మంది మహిళలు ఫ్రీ బస్ ప్రయాణాన్ని వినియోగించుకున్నట్లు చెప్పారు. తమ ప్రభుత్వం ప్రతి ఇంటి నుంచి దరఖాస్తును స్వీకరిస్తోందన్నారు. ఆరు గ్యారెంటీ పథకాలతో పాటు రేషన్ కార్డు, బస్తీ సమస్యల దరఖాస్తులను కూడా సమర్పించవచ్చన్నారు. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా 150 వార్డులలో 600 కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరిస్తున్నట్లు తెలిపిన మంత్రి.. అవసరమైతే మరిన్ని కౌంటర్లు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.

Tags:    

Similar News