బీఆర్ఎస్-బీజేపీ బంధం ఫెవికాల్ కంటే గట్టిది : Ponnam Prabhakar

Byline :  Krishna
Update: 2024-02-13 15:48 GMT

కాంగ్రెస్ సర్కార్ ఇవాళ మేడిగడ్డ సందర్శన కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రాజెక్టు కుంగుబాటుపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ విజిట్కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు సీపీఐ ఎమ్మెల్యే, ఎంఐఎం ఎమ్మెల్యేలు హాజరయ్యారు. బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు దీనికి దూరంగా ఉన్నారు. కృష్ణా జలాల వివాదంపై బీఆర్ఎస్ నల్గొండలో బహిరంగ సభ నిర్వహించింది. అయితే బీజేపీ ఎమ్మెల్యేలు ప్రాజెక్టు సందర్శనకు హాజరుకాకపోవడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ సూచనలతోనే బీజేపీ ఎమ్మెల్యేలు మేడిగడ్డ సందర్శనకు రాలేదని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ప్రాజెక్టు సందర్శనకు ఎందుకు రాలేదో బీజేపీ ఎమ్మెల్యేలు సమాధానం చెప్పాలన్నారు. కేసీఆర్‌ డైరెక్షన్‌లో కిషన్‌ రెడ్డి ఇచ్చిన సలహాతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు మేడిగడ్డకు రాలేదని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ - బీజేపీల బంధం ఫెవికాల్‌ కంటే గట్టిదని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై కేంద్రం ఎందుకు విచారణ చేయడంలేదని ప్రశ్నించారు. ఇదంతా లోక్ సభ ఎన్నికల్లో పొత్తు కోసం కాదని ఆ రెండు పార్టీలు చెప్పగలవా అని నిలదీశారు.

Tags:    

Similar News