సైకోల కోసం పిచ్చి ఆస్పత్రి కట్టిస్తా - పువ్వాడ అజయ్

By :  Lenin
Update: 2023-11-04 07:32 GMT

ఖమ్మంలో కొందరు సైకోలుగా మారి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. శనివారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ గ్రౌండ్లో ఏర్పాటు సమావేశంలో మీడియాతో మాట్లాడారు. సైకోలుగా మారిన వారి కోసం ఖమ్మం నగరంలో పిచ్చి ఆసుపత్రి కట్టించి వారికి వైద్యం అందిస్తామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కాలేజ్ గ్రౌండ్ లో ఉన్న స్టేజ్ ఆదివారం జరిగే ప్రజా ఆశీర్వాద సభకు అడ్డంగా ఉందన్న కారణంతో తొలగించారని, మీటింగ్ పూర్తైన అనంతరం దాన్ని మళ్లీ కట్టిస్తామని అజయ్ స్పష్టం చేశారు. అయితే కొందరు మాత్రం దీనిపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు‌‌. ఆదివారం కేసీఆర్ పాల్గొనే ప్రజా ఆశీర్వాద సభకు జనం భారీ ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని అజయ్ పిలుపునిచ్చారు.

గత 9ఏండ్లలో రాహుల్ గాంధీ ఏనాడూ తెలంగాణ సమస్యలపై పార్లమెంటులో మాట్లాడలేదని పువ్వాడ అజయ్ విమర్శించారు. ఇప్పుడు ఓట్ల కోసం ఎన్ని యాత్రలు చేసినా కాంగ్రెస్ నేతలు ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజలకు అండగా నిలిచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు జరిగిన 3 ప్రజా ఆశీర్వాద సభలకు భారీ స్పందన లభించిందని అజయ్ అన్నారు. 

Tags:    

Similar News