ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్దీ తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. నేతల మధ్య మాటలు తూటాల పేలుతున్నాయి. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై శుక్రవారం సీఎం కేసీఆర్ విమర్శలు గుప్పించగా.. తుమ్మల సైతం కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలో మంత్రి పువ్వాడ తుమ్మలపై ఫైర్ అయ్యారు. కేసీఆర్ గురించి తమ్ముల ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం బాధాకరమన్నారు.
2014లో కేసీఆర్ మంత్రి పదవి ఇవ్వకుంటే తుమ్మల ఇప్పటికే రిటైర్ అయ్యేవారని పువ్వాడ ఆరోపించారు. కేసీఆర్‌కు తుమ్మల మంత్రి పదవి ఇప్పించారనడం విడ్డూరంగా ఉందన్నారు. తనను ఓడించేందుకు కేటీఆర్ కుట్రలు చేశారని తుమ్మల ఆరోపించారు. బీఆర్ఎస్ టికెట్ ఇచ్చి ఓడిపోవాలని కుట్ర చేస్తారా. అలా అయితే బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోతుండే. పదవుల కోసం తుమ్మల దిగజారారు. తుమ్మల ఎప్పుడు జై తెలంగాణ అనలేదు. తెలంగాణ నినాదం చేసినవాళ్లను జైల్లో వేయించారు’’ అని పువ్వాడ ఆరోపించారు.