బీఆర్ఎస్ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి సీతక్క. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఆర్టీసీని మొత్తం ధ్వంసం చేశారని మండిపడ్డారు. ఆర్టీసీ ఉద్యోగుల ఆత్మహత్యకు కారణమైన వారు ఇప్పుడు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పేదవాళ్లు ఎక్కే ఫ్రీ బస్సు పై మీకెందుకు అంత అక్కసు అని ప్రశ్నించారు. ఆడవాళ్లు బస్సుల్లో వస్తే ఎందుకు బీఆర్ఎస్ నేతలు తట్టుకోలేకపోతున్నారని దుయ్యబట్టారు. వ్యవసాయం పేరుతో అనేక మంది కోట్లాధికారులకు రైతు బంధు కట్టబెట్టిన ఘనత బీఆర్ఎస్ దేనని చెప్పుకొచ్చారు. ఆటోలను ముందు పెట్టి బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని చెప్పారు. మొదటి నుంచి సెంటిమెంట్లను ముందుకు పెట్టి వెనక నుండి వచ్చే నైజం బీఆర్ఎస్ దని తెలిపారు.
పేదవాళ్ల పై పన్నులు వేసి వచ్చిన ధనంతో బీఆర్ఎస్ నేతలు లక్షలు దోచుకున్నారని తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ప్రయాణిస్తే మీకేం ప్రాబ్లమ్ అని ప్రశ్నించారు. భావోద్వేగాలు రెచ్చగొట్టడమే బీఆర్ఎస్ లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి సీతక్క చెప్పారు.